విశాఖలో కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!

  • విశాఖలో పర్యటించిన పవన్ కల్యాణ్
  • పవన్ కు సాదర స్వాగతం పలికిన కొణతాల
  • ఇది మర్యాదపూర్వక భేటీయేనన్న జనసేన పార్టీ 
జనసేనాని పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించారు. పార్టీ నేత కొణతాల రామకృష్ణ నివాసానికి వెళ్లారు. పవన్ కు సాదర స్వాగతం పలికిన కొణతాల శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించుకున్నారు. ఇది మర్యాదపూర్వకంగా జరిగిన భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. 

ఉత్తరాంధ్రలో బలమైన నేతగా ఉన్న కొణతాల రామకృష్ణ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవలే జనసేనకు దగ్గరయ్యారు. అయితే, కొణతాల వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొణతాల అనకాపల్లి పార్లమెంటు స్థానం బరిలో దిగుతారని వార్తలు రాగా, తాజాగా అనకాపల్లి ఎంపీ బరిలో నాగబాబు పేరు కూడా తెరపైకి వచ్చింది. దీనిపై జనసేన అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Pawan Kalyan
Konathala Ramakrishna
Visakhapatnam
Janasena

More Telugu News